విజయనగరం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వానలు పడుతున్నాయి. గంట్యాడ, జామి, కొత్తవలస, లక్కవరపుకోట, భోగాపురం మండలాల్లో సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. ఓ మోస్తారు వర్షపాతం నమోదు కావటంతో.. జలాశయాలు, చెరువుల్లోకి వరదనీరు చేరుతోంది. నాగావళినది వరద ప్రభావంతో తోటపల్లి ప్రాజెక్ట్ లో నీటి నిల్వ 2.384 టీఏంసీలకు చేరింది. వట్టిగెడ్డ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 105మీటర్లు కాగా... ప్రస్తుతం 104 మీటర్లకు చేరింది. దీంతో అక్కడక్కడ ఖరీఫ్ వరినాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జలాశయాల్లోకి స్వల్పంగా నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు వరిసాగుకు శ్రీకారం చుట్టారు.
వాయుగుండం ప్రభావం.. విస్తారంగా వర్షం - విజయనగరం జిల్లా
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లాలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు