విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గడివలస గిరిజన గ్రామంలో 365 కుటుంబాలకు తెదేపా నాయకుడు పిన్నింటి ప్రసాద్ కూరగాయలు, గుడ్లు, బియ్యం పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని కోరారు.
గిరిజన కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - lockdown effect on people
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా రోజువారీ పనులు చేసుకుని ఉపాధి పొందుతున్న కూలీలు, పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు మేమున్నామంటూ సహాయం చేస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
విజయనగరం జిల్లాలో గిరిజన కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ