విజయనగరం ఆర్ అండ్ బీ రైతు బజార్ వద్ద కరోనా వ్యాధి నిరోధక క్రిమిసంహారక టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ ఆఫ్ విజయనగరం సంస్థ ఆధ్వర్యంలో ఈ టన్నెల్ ఏర్పాటైంది. వైకాపా జిల్లా యువజన విభాగం నాయకుడు ఈశ్వర్ కౌశిక్, జిల్లా వైకాపా కార్యకలాపాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఈ టన్నెల్ ను ప్రారంభించారు. ప్రజల సహకారంతోనే జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా ఇప్పటివరకూ నమోదు కాలేదన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనాను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
రైతు బజార్ వద్ద క్రిమి సంహారక టన్నెల్ ఏర్పాటు - tunnel opened at vijayanagaram randb guest house raithu market
విజయనగరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ దగ్గరలోని రైతు బజార్ వద్ద క్రిమి సంహారక టన్నెల్ ఏర్పాటు చేశారు. టేబుల్ ఆఫ్ విజయనగరం సంస్థ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు.
విజయనగరం ఆర్అండ్బీ రైతుబజార్ల దగ్గర టన్నెల్ ప్రారంభం