ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజీపీ ఆర్పీ ఠాకూర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు - checking

నిబంధనలు ముందు అందరూ సమానమేనని నిరూపించారు రాష్ట్ర పోలీసులు. ఏకంగా డీజీపీ కారునే ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాకే పంపించారు.

తన వాహనాన్ని తనిఖీ చేసిన సిబ్బందితో మాట్లాడుతున్న డీజీపీ

By

Published : Apr 3, 2019, 5:43 AM IST

ఎన్నికల వేళ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిశీలించేందుకు ప్రైవేట్ వాహనంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ క్షేత్రస్థాయి పరిశీలనకువెళ్లారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మీదుగా అరకు వైపు వాహనంలో వెళ్తూ బొడ్డవర సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు వాహన తనిఖీ చేపడుతుండగా... యథావిథిగా తన వాహనాన్ని తనిఖీ చేయాలని డీజీపీ ఆర్పీ ఠాకూర్వారిని ఆదేశించారు. తన వాహనంలో పోలీసుల ఆయుధాలు తప్ప ఇతర వస్తువులేమీ లేనందున...వదిలేశారని ఠాకూర్ తెలిపారు. తన వాహనాన్ని తనిఖీ చేసిన సిబ్బందికి రివార్డునివ్వాలని విజయనగరం ఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు.

ఠాకూర్ వాహనాన్ని తనిఖీ చేస్తున్న సిబ్బంది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details