ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సూచించారు. విజయనగరంజిల్లా ప్రగతిపై జిల్లా ఇంఛార్జీ మంత్రి శ్రీరంగనాథ రాజు ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రగతి సమీక్షలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, చక్కెర పరిశ్రమ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వైద్య-ఆరోగ్య, విద్యా శాఖలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..గత ప్రభుత్వ వైఫల్యాను గుర్తుచేసి విమర్శించారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మాధవి, శాసనసభ్యులు, కలెక్టర్ హరి జవహర్ లాల్, వివిధశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సమీక్ష - ఉపముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి అక్రమాలు విపరీతంగా జరిగాయని .... కోడిగుడ్డు నుంచి ఇసుక వరకు తెదేపా నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణీ విమర్శించారు. విజయనగరంజిల్లా ప్రగతిపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సమీక్ష