విజయనగరం జిల్లా కొమరాడ లో తాగునీటికై మహిళలు ఆందోళనకు దిగారు. వీరికి సీపీఎం పార్టీ మద్దతు ప్రకటించింది. ఖాళీ బిందెలతో రాస్తారోకో కు దిగడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. రెండు నెలలుగా తాగునీటికోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నా, అధికార్లు పట్టించుకోవడం లేదని సీపీఎం నేతలు ఆరోపించారు. చివరకు సమస్య పరిష్కారం కోసం ఎంపీడీవోతో ఫోన్లో మాట్లాడించిన అనంతరం మహిళలు ధర్నా విరమించారు. ఈ రోజు సాయంత్రం లోపు మంచినీరు వచ్చేలా చర్యలు చేపడతామని హామీ అధికార్లు ఇచ్చారని మహిళలు తెలిపారు.
తాగునీటి కోసం రాస్తారోకోకు దిగిన మహిళలు - తాగునీటి కోసం రాస్తారోకో
ఒక్క రోజు నీరు లేకపోతేనే మనం అల్లాడిపోతాం, అలాంటిది రెండు నెలలుగా తాము తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని విజయనగరం జిల్లా కొమరాడ ప్రజలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో తో చివరకు స్పందించిన అధికార్లు, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తాగునీటి కోసం రాస్తారోకో