విజయనగరం జిల్లా భోగాపురం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. లాక్డౌన్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బి. సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 7,500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కనీసం 6 నెలల పాటు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్వీ రమణ, రాంబ్రహ్మం, నర్సింగరావు, జోగారావు, తదితరులు పాల్గొన్నారు.
'పేద కుటుంబాలకు రూ.7500 ఆర్థిక సాయం అందించండి' - vijayangaram district latest news
పేద కుటుంబాలకు రూ. 7500 ఆర్థిక సాయం అందించాలని భోగాపురం మండల కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. కనీసం 6 నెలల పాటు పేద కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
భోగాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆందోళన