విజయనగరంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు ఆధ్వర్యలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులకు అండగా నిలిచిన తమ నాయకులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ధర్నా చేస్తున్నామని తెలిపారు.
ఆ ఘటనతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి అండగా నిలవడం తప్పా అని ప్రశ్నించారు. వారి అరెస్టును ఖండిస్తున్నామన్నారు. వెంటనే తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.