ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నిర్ధరణ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు పనులు ముమ్మరం - ap lockdown

విజయనగరం జిల్లాలో కరోనా పరీక్షలను మరింత అధిక సంఖ్యలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ట్రూనాట్ మెషీన్ల ద్వారా, రాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు జరుగుతున్నాయి. ల్యాబ్ లేకపోవడంతో కేసుల నిర్ధరణలో జాప్యం జరుగుతోంది. సమస్య పరిష్కారానికి మిమ్స్ ఆసుపత్రి ఆవరణలో పరీక్షల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

Corona  Determination  lab in nellimarla
నెల్లిమర్లలో కరోనా పరీక్షల ల్యాబ్

By

Published : May 14, 2020, 9:24 AM IST

విజయనగరంజిల్లాలో కరోనా పరీక్షలను మరింత అధిక సంఖ్యలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నానికి కరోనా శాంపిల్స్ పంపించాల్సి వస్తోంది. ఒక గ్రూప్ లో పంపిన శాంపిల్స్ కు వేర్వేరు రోజుల్లో ఫలితాలు వస్తున్న కారణంగా.. ఆయా గ్రూప్ కు సంబంధించిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాల్లో ఆ ఫలితాలు వచ్చే వరకు ఉంచాల్సి వస్తోంది.

ఈ కారణంగా.. కేంద్రాలకు కొత్తగా వచ్చే వారికి వసతి కల్పించడం సమస్యగా ఉంటోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు కరోనా నిర్ధరణ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక వీఆర్​డీఎల్ (వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ లాబరేటరీ) ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తోంది.

నెల్లిమర్లలోని మిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో వున్న హోమియోపతి రీసెర్చ్ కేంద్ర భవనంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్​టీపీసీఆర్ పరికరం, రెండు రిఫ్రిజిరేటర్ లు కుడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. పనులు మరింత వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ మిమ్స్ ఆసుపత్రి ఆవరణ లోని ల్యాబ్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించారు.

బయో సేఫ్టీ కాబినెట్ , లామినార్ ఎయిర్ ఫ్లో తదితర రెండు మెషీన్లు హైదరాబాద్ నుంచి రావాల్సి వుందని.. జాయింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాథ్ చెప్పారు. మైక్రో బయాలజిస్ట్, టెక్నికల్ నిపుణులు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారని తెలిపారు. మినీ స్పిన్నర్, వోర్టేక్స్ మిక్సర్, వాటర్ బాత్, కూలింగ్ సెంట్రి వంటి పరికరాల ఏర్పాటు పూర్తయిందని పేర్కొన్నారు. ఎన్ఏబీఎల్​కు అక్రిడేషన్​ దరఖాస్తు ప్రక్రియ చేపట్టామని డీసీహెచ్ఎస్. డా.నాగభూషణ రావు తెలిపారు.

ఈ ల్యాబ్ ఏర్పాటు విషయమై రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ. విజయరామరాజు తో ఫోన్ లో మాట్లాడారు. సహకరించాలని కోరారు. స్థానికంగా అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్పారు. పర్యటనలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారిని డా.ప్రియాంక, మిమ్స్ లో కోవిడ్ చికిత్స ప్రత్యేక అధికారి డా.సుబ్రహ్మణ్యం, మిమ్స్ ప్రిన్సిపాల్ డా.హెచ్.వి.కుమార్, మైక్రో బయాలజిస్ట్ షంషేర్, టెక్నికల్ నిపుణులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

విజయనగరం జిల్లాలో కంటైన్మెంట్ జోన్లు

ABOUT THE AUTHOR

...view details