విజయనగరం జిల్లా మండలం సీమనాయుడు వలస, బిత్రపాడు గ్రామాల్లో మొక్కజొన్న రైతులు నిరసన చేపట్టారు. ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి.. కొనుగోలు చేయటం లేదని రైతులు వాపోయారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి.. నేడు ఎకరానికి 9-11 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనటం దారుణమన్నారు.
మొక్కజొన్న రైతులకు దిక్కెవరు..?
విజయనగరం జిల్లాలో రైతులు నిరసన చేపట్టారు. ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయటం లేదని వాపోయారు. నాడు ప్రతి గింజ కొంటామని చెప్పి.. నేడు ఎకరానికి 9-11 క్వింటాళ్లు మాత్రమే కొంటామనటం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు.
Corn farmers protest
మరోవైపు అకాల వర్షాలతో అరబోసిన మొక్కజొన్న పంట తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పురుగుల మందే తమకు దిక్కన్నారు.
ఇదీ చదవండి