ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు చెల్లించాలని ఒప్పంద వైద్య సిబ్బంది ఆందోళన - విజయనగరం జిల్లా తాజా వార్తలు

ఐదు నెలలు గడుస్తున్నా... జీతాలు చెల్లించడం లేదని విజయనగరం జిల్లాలో కొవిడ్-19 ఒప్పంద వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్​ను కలిసి తమ సమస్యను వెల్లడించారు.

ఒప్పంద వైద్య సిబ్బంది
ఒప్పంద వైద్య సిబ్బంది

By

Published : Dec 21, 2020, 5:55 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల కోసం ఒప్పంద ప్రతిపాదికన సిబ్బంది నియామకాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఒక్కో ఏజెన్సీ... ఉద్యోగులను నియమించింది. స్థాయిని బట్టి 15 వేల నుంచి 23 వేల వరకు వేతనాలను నిర్ణయించింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తామన్న ఏజెన్సీలు... ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క నెలా వేతనాన్ని ఇవ్వలేదు.

వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులకు మెురపెట్టుకున్నా ఒప్పంద సిబ్బందికి ఫలితం లేకుండా పోయింది. జిల్లాకు చెందిన ఒప్పంద ఉద్యోగులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హరి జవహర్ లాల్​ ను కలిశారు. తమ సమస్య విన్నవించారు. పెండింగ్​లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఉద్యోగం కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details