విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలోని బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్ధుల మధ్య గొడవ దాడికి దారి తీసింది. వసతి గృహంలో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థి సిద్ధార్థ్‌పై తోటి విద్యార్థులు బ్లేడుతో దాడి చేశారు. బ్లేడుతో పలుమార్లు చేతిపై గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
గురుకుల పాఠశాలలో సహచర విద్యార్థిపై బ్లేడుతో దాడి - జోగింపేట
విద్యార్థుల మధ్య జరిగిన గొడవ దాడికి దారి తీసింది. తోటి స్నేహితుడు అని చూడకుండా సహచర విద్యార్థులు సిద్ధార్థ్ అనే విద్యార్థిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన జోగింపేటలోని గురుకుల పాఠశాలలో జరిగింది.
గురుకుల పాఠశాలలో సహచర విద్యార్థిపై బ్లేడుతో దాడి