కొరియా పగులుచెన్నూరులో ఉద్రిక్తత
22:47 October 13
ఇరు రాష్ట్రాల నేతలు, అధికారులు ఒకేసారి పర్యటించడంతో వివాదం
కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన పగులుచెన్నూరులో ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకేసారి పర్యటించడంతో వివాదం నెలకొంది. పగులుచెన్నూరు, పట్టుచెన్నూరు గ్రామాల్లోని ప్రజలు రాబోయే రోజుల్లో ఒడిశా తరపున ఓటింగ్‌లో పాల్గొనకూడదని ఇటీవల నిర్ణయించారు. దీనిపై మాట్లాడేందకు రెండు పంచాయతీల పరిధిలోని గ్రామస్థులు పగులుచెన్నూరులో బుధవారం సమావేశమయ్యారు. దీనికి పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ హాజరు కాగా, అదే సమయంలో పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ అక్కడికి వచ్చారు.
ఒడిశా ప్రాంతంలోకి మీరెందుకు వస్తున్నారంటూ పీవోను ఎమ్మెల్యే ప్రీతమ్ ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగం కాదని, వివాదాస్పద ప్రాంతమని పీవో సమాధానమిచ్చారు. దీంతో వివాదం మొదలైంది. ఎన్నికలు బహిష్కరిస్తామని స్థానికులు చెబుతుంటే అలాంటి కార్యక్రమానికి మీరు ఎందుకు వచ్చారంటూ మరోసారి పీవోను ఎమ్మెల్యే ప్రశ్నించారు. గోబ్యాక్ గోబ్యాక్ అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో పీవో అక్కడి నుంచి వచ్చేయడంతో సద్దుమనిగింది.
ఇదీ చదవండి