లక్ష్మీనృసింహా స్వామికి చందనోత్సవం - విజయనగరం
గంధం అమావాస్య సందర్భంగా విజయనగరం జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీపురంలోని లక్ష్మీనృసింహా స్వామి ఆలయంలో చందనోత్సవం ప్రారంభమైంది.
లక్ష్మీనృసింహా స్వామికి చందనోత్సవం
విజయనగరం జిల్లా పార్వతీపురంలో వెలసిన లక్ష్మీనృసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గంధం అమావాస్య సందర్భంగా స్వామివారికి చందనంతో అభిషేకం చేశారు. ఈ నెల 8వరకు చందనోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పంచామృతాభిషేకాలతో స్వామివారిని కొలిచారు. లక్ష్మీనృసింహా స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.