విజయనగరం జిల్లా, సాలూరు మండలం, శివరాం పురం గ్రామంలోని పలువురి బ్యాంక్ ఖాతాల్లోకి కనక వర్షం కురిసిందనే విషయం అందరికీ తెలిసిందే. గ్రామంలో 607 కుటుంబాలు ఉండగా.. సుమారు 3 వేల జనాభా ఉన్నారు. ఇందులో దాదాపు 200 మంది బ్యాంకు ఖాతాల్లోకి ఆకస్మికంగా రూ. 13 వేల 500 ల డబ్బు వచ్చి చేరింది. అయితే ఇవి ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన అటవీ భూముల పట్టాలు నగదుగా ఐటీడీఏ పీవో కుర్మానాథ్ తెలిపారు. ఆధార్ కార్డు లింక్ చేయడంలో తప్పిదం కారణంగా పలు ఖాతాల్లోకి సొమ్ములు జమ అయ్యాయని అన్నారు. నగదు పడిన అకౌంట్లను బ్లాక్ చేయాలని అన్ని శాఖల బ్యాంకు అధికారులకు మెయిల్ ద్వారా సమాచారమిచ్చామని సాలూరు ఆంధ్ర బ్యాంకు బ్యాంక్ మేనేజర్ చెప్పారు. ప్రభుత్వ సొమ్మును.. ఇంకొకరు తీసి వాడినట్లయితే చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకు నుంచి నగదును విత్ డ్రా చేసిన వారి గురించి.. తరువాత నిర్ణయానికి వస్తామని తెలిపారు. త్వరలోనే ఈ తప్పును సరిచేయనున్నామని చెప్పారు.
ఆధార్ కార్డు లింక్ చేయడంలో తప్పిదం.. పలు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ.. - విజయనగరంలోని పలు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ
ఆధార్ కార్డు లింక్ చేసే క్రమంలో తప్పిదం కారణంగా.. విజయనగరం జిల్లా, సాలూరు మండలం, శివరాం పురం గ్రామంలోని పలువురి ఖాతాల్లోకి డబ్బు చేరినట్లు ఐటీడీఏ పీవో తెలిపారు. నగదు పడిన అకౌంట్లను బ్లాక్ చేయాలని.. ఇప్పటికే అన్ని బ్యాంకు శాఖలకు మెయిల్ ద్వారా సమాచారమిచ్చామని సాలూరు ఆంధ్ర బ్యాంకు మేనేజర్ అన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఆధార్ కార్డు లింక్ చేయడంలో తప్పిదం.. పలు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ..