విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ఓ అన్నాచెల్లెళ్ల అనుబంధం ముందు మృత్యువు ఓడిపోయింది. ఐదు పదుల వయసులోనూ అప్యాయతకు మారు పేరుగా నిలిచే ఆ రక్తబంధం.. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగానికి నిదర్శనంగా నిలిచింది. చెల్లెలు కేత పార్వతి (56).. ఇటీవలే అనారోగ్యంతో చనిపోయింది. ఈ వార్త విన్న అన్న తెర్లాపు చిన్న (59).. చెల్లెలిని కడసారి చూసేందుకు వచ్చాడు. విగతజీవిగా ఉన్న తన ఆడపడుచును చూసి తట్టుకోలేక.. చివరి శ్వాస విడిచాడు.2 ఆసుపత్రులకు తరలించినా.. ఆయన బతకలేదు. చెల్లి మరణించిన గంటల వ్యవధిలోనే అన్న మరణించడం.. ఆ కుటుంబం విషాదంలో నింపింది.
మరణంలోనూ వీడని బంధం.. చెల్లి వెంటే అన్న పయనం - span of a few hours
విజయనగరం జిల్లా సాలూరు చెందిన ఓ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మృతువు విడదీయలేకపోయింది. ఐదు పదులు వయసులోనూ చెల్లి కోసం తాపత్రాయపడే ఆ అన్న గుండె... చెల్లి మరణాన్ని తట్టుకోలేక ఆగిపోయింది. చెల్లి మరణించిన గంటల వ్యవధిలోనే అన్నయ్య మరణించాడు.
గంటల వ్యవధిలో అన్నాచెల్లెలు మృతి
Last Updated : Jul 21, 2019, 8:58 AM IST