విజయనగరం జిల్లా గజపతినగరంలో హృదయ విదారకర ఘటన జరిగింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న నీటికుంటలో పడి ఉన్న నవజాతశిశువు మృత దేహం అందరిలో కలవరం రేపింది. శిశువు దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.ఐ, ఐసీడీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిశువు రెండు రోజుల క్రితం జన్మించినట్లు ఉందని... పుట్టిన వెంటనే నీళ్లలో పడేసినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు.
దారుణం.. నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం - vizianagaram
రెండు రోజుల క్రితం పుట్టిన శిశువు మృతదేహం...నీటి మడుగులో శవమై తేలాడు. అమ్మ లాలనతో...పొత్తిళ్లలో వెచ్చగా సేద తీరాల్సిన చిన్నారి... విగత జీవిగా కనిపించిన ఘటన విజయనగరం జిల్లా గణపతి నగరంలో చోటు చేసుకుంది
హృదయవిదారక ఘటన... నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం