విజయనగరం జిల్లాలో భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులు ఆందోళనకు దిగారు. 2020-21 కాలంలో షుగర్ ఫ్యాక్టరీని నిలుపుదల చేస్తూ ఇటీవల నోటీసు బోర్డులో ఎండీ కె. ఆర్. విక్టర్ బాబు వివరాలు ఉంచారు. ఫ్యాక్టరీ అధునీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇక్కడ చెరకును బొబ్బిలి ఎన్సీఎస్కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఈ చక్కెర కర్మాగారంపై ఆధారపడ్డ చెరుకు రైతులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్మాగారానికి 40 ఏళ్లుగా తాము చెరుకును సరఫరా చేస్తున్నామని... ముందస్తు సమాచారం లేకుండా ఈ పని చేయడం దారుణమని వాపోయారు. తమ చెరుకును ఇక్కడే గానుగా ఆడాలని... ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తే బిల్లుల చెల్లింపు సక్రంగా ఉండవని ఆవేదన తెలిపారు.
భీమసింగి చక్కెర కర్మాగారం ఎదుట రైతుల ఆందోళన - vijayangaram district latest news
భీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కర్మాగారాన్ని నిలిపివేయడం దారుణమన్నారు. తమ చెరుకును ఇక్కడే గానుగ ఆడాలంటూ డిమాండ్ చేశారు. మరో చోటికి తరలించడం తాము అంగీకరించబోమన్నారు.
భీమసింగి చక్కెర కర్మాగారం వద్ద చెరుకు రైతుల నిరసన