విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టులో దస్త్రాల అన్వేషణ కొనసాగింది. ఆడిట్ అధికారులు కోరిన మేరకు ట్రస్టు సిబ్బంది దస్త్రాలను అందించారు. మాన్సాస్ కార్యాలయంలో ఆడిటింగ్ అధికారి హిమబిందు ఆధ్వర్యంలో 27 మంది అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆడిట్ చేస్తున్నారు. నాలుగైదు ఏళ్ల దస్త్రాలు తనిఖీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. మాన్సాస్ వ్యవహారం వివాదాస్పదమైన వేళ.. ట్రస్టు ఆడిట్ పూర్తిచేసేందుకు జిల్లా అధికారులు.. కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతి కోరినట్లు తెలుస్తోంది.
Mansas trust : మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయంలో ఆడిటింగ్ - mansas trust
విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్(mansas trust) కార్యాలయంలో ఆడిటింగ్(auditing) కొనసాగుతోంది. అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి దస్త్రాలను(files) పరిశీలిస్తున్నారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. పరిశీలన అంశాలను కమిషనర్ కు అందజేయనున్నారు.
సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు భూముల్లో కొన్నింటిని ఆస్తుల జాబితా నుంచి తొలగించారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా విజయనగరంలోని మాన్సాస్ కార్యాలయంలో విచారణ కమిటీ సభ్యురాలు భ్రమరాంబ దస్త్రాలను పరిశీలించారు. ఆస్తుల జాబితా నుంచి సింహాచలం, మాన్సాస్ భూములను తొలగించారన్న అనుమానంతో దేవాదాయశాఖ ఉప కమిషనర్ పుష్పవర్ధన్ ను విచారణ అధికారిగా నియమించారు. విచారణ అధికారి ఆదేశాల మేరకు మాన్సాస్ భూములకు సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు భ్రమరాంబ తెలిపారు. పరిశీలన అంశాలను కమిషనర్ కు అందజేస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి.
SANGAM DAIRY: 'ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు పిటిషన్'.. కొట్టేసిన హై కోర్టు
TAGGED:
మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయం