విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గురువారం దాడులు చేశారు. మక్కువ, వైఎస్ వలస, తాడిలోవ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. 500 నాటుసారా ప్యాకెట్లు, మూడు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని సాలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు - సాలూరు నేర వార్తలు
రాష్ట్రంలో నాటుసారా తయారీ జోరందుకుంది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో అక్రమార్కులు సారా తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు తనిఖీలు నిర్వహించి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు.. ముగ్గురిపై కేసు నమోదు