విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న జాతర మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని ఆలయ ఛైర్మన్ గోవింద తెలిపారు. తాగునీరు, శానిటేషన్, వైద్య సంబంధిత సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు.
శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి జాతరకు ముమ్మర ఏర్పాట్లు - చీపురుపల్లి జాతర వార్తలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి జాతర ఏర్పాట్లు సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని ఆలయ ఛైర్మన్ గోవింద తెలిపారు. పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని చీపురుపల్లి ఎస్సై దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు.
జాతరకు ముమ్మర ఏర్పాట్లు
జాతరలో ప్రత్యేక ఆకర్షణగా బాహుబలిలోని మాహిష్మతి సామ్రాజ్యం సెట్టింగ్గా వేశామని వైకాపా పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రేలారే రేలా, బాల నాగమ్మ వంటి బుర్రకథలు ఉంటాయని ఆయన వివరించారు. మంగళవారం రథోత్సవంలో భాగంగా అమ్మవారి భారీ ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని చీపురుపల్లి ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
TAGGED:
Vizianagaram District news