విజయనగరం జిల్లా ఎస్.కోట మండల పరిషత్ కార్యాలయంలో మంచి నీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గాయత్రి దేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, ఈఓపిఆర్ఆర్డిలు, ఆర్డబ్ల్యూఎస్ సహాయ ఇంజనీర్లు, డిఈఈతో గ్రామాల వారీగా మంచి నీటి సమస్య పై సమీక్ష చేశారు. నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది కలిగినా.. తక్షణమే ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఐదు మండలాల్లో మంచినీటి సమస్యను తెలియజేయడానికి వీలుగా ఫోన్ నెంబర్లు ప్రకటించారు.
నీటి సమస్యపై ఉన్నతాధికారుల సమీక్ష - samiksha
నీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సమీక్ష నిర్వహించారు. సమస్య ప్రాంతాల్లో నీటిని ట్యాంకుల ద్వారా సరాఫరా చేస్తామని తెలిపారు.
నీటి సమస్యపై సమీక్ష సమావేశం