ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ సీఎం అయ్యాడని కాలినడకన తీర్థ'యాత్ర' - foot march

జగన్ ముఖ్యమంత్రి అయితే కాలినడకన తిరుపతి వస్తానని మొక్కుకున్నాడు ఆ పెద్దాయన. తన కోరిక నెరవేరినందున ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు విజయనగరం నుంచి యాత్ర మొదలుపెట్టాడు.

Dఅభిమాని పాదయాత్ర

By

Published : Jun 18, 2019, 8:48 PM IST

అభిమాని పాదయాత్ర

విజయనగరం జిల్లా నెలిమెర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ఆలూరు లక్ష్మణరావు... వైఎస్ జగన్​కు వీరాభిమాని. వైకాపా అధినేత ముఖ్యమంత్రి అయితే... కాలినడకన ఏడుకొండలవాడి సన్నిధికి వస్తానని గతంలో మొక్కుకున్నాడట ఈ పెద్దాయన. ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించడం... జగన్ సీఎం పదవిలో చేపట్టడంతో తన మొక్కు చెల్లించుకునేందుకు తీర్థయాత్ర మొదలుపెట్టారు. ఈ నెల 5న విజయనగరం నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్లేందుకు బయలుదేరిన లక్ష్మణరావు... మార్గ మధ్యలోని ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ తీర్థయాత్రలో భాగంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

ఇప్పటికి 13 రోజుల పాటు నడక సాగించిన లక్ష్మణరావు.. మరో 13 రోజుల్లో తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటానంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details