Suspension: విజయనగరం కార్పొరేషన్ పరిధి కె.ఎల్.పురంలో పూరిపాక తొలగింపు విషయంలో ఓ మహిళపై లైగింక వేధింపులకు పాల్పడిన శానిటరీ సూపర్ వైజర్ త్రినాథ్‌ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. త్రినాథ్‌పై పట్టణ రెండో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కార్పొరేషన్ ప్రజావైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. పొరుగు సేవల ఉద్యోగి అయిన త్రినాథ్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయని.. 6 నెలల పాటు సస్పెషన్‌కు గురయ్యాడని కూడా ఆయన చెప్పారు.
లైంగికంగా వేధించాడని.. కార్పొరేషన్ అధికారిపై చర్యలు - విజయనగరం లేటెస్ట్ అప్డేట్సే
Suspension: మహిళపై లైంగిక వేధింపుల దృష్ట్యా విజయనగరం కార్పొరేషన్ శానిటరీ అధికారి త్రినాథ్‌ను విధుల నుంచి తొలగించారు. మహిళను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మేయర్, కమిషనర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు విజయనగరం ప్రజారోగ్య అధికారి తెలిపారు.
విజయనగరం కార్పొరేషన్ శానిటరీ అధికారిపై చర్యలు
తాజాగా 45 డివిజన్ కె.ఎల్.పురంలో అక్రమంగా వేసుకున్న గుడిసె తొలగింపు విషయంలో.. ఆ గుడిసెకు చెందిన మహిళను లైగింకంగా వేధించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వేధింపులకు సంబంధించిన వాయిస్ రికార్డ్‌ను ఆధారంగా చేసుకుని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగిని తొలగించినట్లు విజయనగరం ఎంహెచ్ఓ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: "ఇక్కడ పండు చెబితేనే ఏదైనా...మాతో వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి"
TAGGED:
Vizianagaram latest updates