ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదివేది అగ్రికల్చర్ బీఎస్సీ .. ఆలోచనలేమో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సుకు వెళ్లేంత..! - అమెరికా అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు

దేశంలో వ్యవసాయ సాగులో ఎన్ని ఇబ్బందులుంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రైతులకు లాభం చేయాలని ఎన్ని ప్రభుత్వాలు అనుకున్నా..దళారులు మాత్రం అడ్డుపడుతూనే ఉన్నారు. ఏమి తెలియని రైతన్నలు.. ఆరుగాలం పండించిన పంటనంతా.. వారి చేతుల్లోనే తక్కువకు పెడతారు. సమయానికి డబ్బు కావాలనే అవసరాలు.. వారు పండించిన పంటను అమ్మేలా చేస్తాయి. వీటి గురించి ఆలోచించిన ఓ విద్యార్థి.. రైతే వ్యాపారిగా మారాలంటోంది. ఆమె విజయనగరం జిల్లాకు చెందిన సిరి చందన. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న ఈ యువతి... భారత్‌ తరపున అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొని.. ఆధునిక వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది. వ్యవసాయేతర కుటుంబం నుంచి వచ్చినప్పటికీ., అమెరికాలో జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న సిరిచందన ప్రతిభపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..

a girl selected  in  International Agricultural Conference at  the usa
విజయనగరంజిల్లా గరివిడి సిరిచందన

By

Published : Jul 9, 2020, 5:05 PM IST

అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న గరివిడి సిరిచందన

వ్యవసాయం...! ఈ పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకువచ్చేది... అన్నదాత కష్టాలే. పగలు, రేయి తేడా లేకుండా కష్టపడే కర్షకులు... అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే దళారులు, విక్రయించే వ్యాపారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు. మంచి ఆదాయం సొంతం చేసుకుంటున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి.. అహర్నిశలు శ్రమించే రైతన్నలకు మేలు జరగాలంటే...అన్నదాతలు వ్యాపారులుగా మారాలని సూచిస్తోంది.. విజయనగరం జిల్లాకు చెందిన సిరి చందన. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న ఈ యువతి...భారత్‌ తరపున అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొని.. ఆధునిక వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది.

  • బీఎస్సీ చదువు....యూఎస్​లో అవకాశం

విజయనగరంజిల్లా గరివిడికి చెందిన ఉప్పు శ్రీనివాసరావు, ఉప్పు పార్వతీ దంపతుల కుమార్తె సిరి చందన. వృత్తిరిత్యా పార్వతీ ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు కాగా, శ్రీనివాసరావు ప్రైవేటుఉద్యోగి. మొదటి నుంచి చదువుల్లో మెరుగ్గా రాణిస్తున్న సిరిచందను ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ చదివించాలని ఆశించారు. సిరించదన ప్రస్తుతం ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నిర్వహిస్తున్న వైరా కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతోంది. పాఠ్యాంశాల్లోనే కాకుండా... వ్యవసాయ రంగంలోని సాంకేతికత పరిజ్ఞానమే సిరిచందనను అమెరికాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే స్థాయికి చేర్చింది. అందులోనూ ఆంగ్రూ పరిధిలో ఈమె ఒక్కరే ఎంపిక కావటం విశేషం. అమెరికాలోని ఓక్లహోమా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ డెవలప్​మెంట్ ప్రోగ్రాంలో పాల్గొంది.

  • ఐదు దశల ప్రతిభా పరీక్షలు..

గతేడాది జూన్ నుంచి ఆగస్టు వరకు రెండు నెలల పాటు జరిగిన ఈ సదస్సు ఎంపికకు విశ్వవిద్యాలయం తరపున ఐదు దశల ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. వీటన్నింటిలోనూ ఉత్తీర్ణత సాధించి... విశ్వవిద్యాలయం తరపున ఓక్లహోమా వ్యవసాయ విశ్వవిద్యాలయ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకుంది.."వ్యవసాయ రంగం-ఎంటర్ ప్రైనర్ షిప్" అనే అంశంపై ప్రధాన అంశంగా సదస్సులో ప్రసంగించినట్లు సిరి చందన చెబుతోంది.

  • మరిన్ని పరిశోధన చేయాలి..

భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధన చేయాలని.., ప్రధానంగా పోస్టు హర్వెస్టింగ్ (పంట కోత అనంతరం చేపట్టే విధానాలు) పై మేలైన విధానాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమంటోంది. అదేవిధంగా అగ్రి బిజినెస్ మేనేజ్​మెంట్ రంగంలో కూడా రాణించాలని ఆశిస్తోంది. ఇలా వ్యవసాయ పరిశోధన రంగంలోనే కాకుండా...నృత్యం, సభలు, సమావేశాలు, సదస్సులో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ అందరిని మెప్పిస్తోంది.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details