ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కానిస్టేబుల్ నిజాయితీ...పోయిన సొమ్ము బాధితుడికి అందజేత - విజయనగరం అప్​డేట్స్

ఓ వ్యాపారి పొగొట్టుకున్న నాలుగున్నర లక్షల రూపాయలను అందచేసి....అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు ఓ కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే...

A constable expressed his sincerity in vizianagram
కానిస్టేబుల్ నిజాయితీ

By

Published : Nov 24, 2020, 12:09 PM IST

ఓ కానిస్టేబుల్‌ తన నిజాయతీని చాటుకున్నారు. డబ్బులు పోగొట్టుకుని.. ఇక దొరకవని ఆశలు వదిలేసి ఆవేదన చెందుతున్న బాధితులకు.. అమితానాందన్ని కలిగించారు. విజయనగరంలోని ఓ కంపెనీ టైర్ల షోరూం యజమాని కె.వీరవెంకట సత్యనారాయణ రూ.4.50 లక్షలను ఒక సంచిలో పెట్టుకుని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. పార్కింగ్‌ స్థలంలో వాహనంపై ఆ సంచి పెట్టి మరిచిపోయారు.

అదే సమయంలో ఒకటో పట్టణ కానిస్టేబుల్‌ జి.అనిల్‌కుమార్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి వద్దకు వచ్చారు. వాహనంపై సంచి కనిపించడంతో ఎవరిదని ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో అందులో ఏముందో చూశారు. డబ్బులు, పాస్‌బుక్‌ కనిపించగా.. అందులో ఉన్న నంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. డీఎస్పీ పి.అనిల్‌కుమార్‌ చేతుల మీదుగా నగదును బాధితుడికి అందించారు.

ABOUT THE AUTHOR

...view details