ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎంపికైన అతిపిన్న వయస్కురాలిగా అరకు ఎంపీ గొడ్డెటి మాధవి నిలిచారు. అరకు పార్లమెంటు స్థానంలో వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచిన గొడ్డెటి మాధవి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్‌పై భారీ మెజార్టీతో గెలిచి మాధవి పార్లమెంటులో అడుగుపెడుతున్నారు.
పార్లమెంటుకు వెళ్లడం నా అదృష్టం: మాధవి - మాధవి
రాష్ట్రం నుంచి అతిపిన్న వయసులో పార్లమెంటుకు వెళ్లడం సంతోషంగా ఉందని అరకు ఎంపీ గొడ్డెటి మాధవి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రిపై ఆమె వైకాపా పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
అరకు ఎంపీ మాధవి
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన మాధవి అనతి కాలంలోనే పార్టీలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఇరవై ఆరేళ్ల ఏళ్ల వయస్సులో భారత పార్లమెంటులో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు మాధవి తెలిపారు. సీపీఐ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొడ్డెటి దేముడు కుమార్తెగా అరకు ప్రాంత ప్రజలకు మాధవి పరిచయం.