Youngman blackmails woman with nude pics : కోరిక తీర్చాలని, లేకుంటే మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను బెదిరిస్తున్న వ్యక్తిపై హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు వివరాల ప్రకారం.. మధురానగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న యువతి(27) యాంకర్‌గా పనిచేస్తోంది. కళాశాలలో చదివే రోజుల్లో సహ విద్యార్థి అయిన కూకట్‌పల్లికి చెందిన కె. సామ్రాట్(30)తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె నిరాకరించింది. స్నేహితుల్లా ఉందామని నమ్మబలికాడు.
కోరిక తీర్చు లేకుంటే.. టీవీ ఛానల్ యాంకర్‌కు యువకుడు బెదిరింపులు - blackmails a woman with nude pics
Young man blackmails a woman with nude pics : స్నేహం కదా అని చనువుగా ఉంటే.. దానిని ప్రేమ అనుకొని.. యువతిని ప్రేమించడం మొదలుపెట్టాడు. తన ప్రేమను వ్యక్తపరచగా ఆ అమ్మాయి తిరస్కరించింది. సర్లే ప్రేమ వద్దు.. స్నేహితులుగా ఉందామని చెప్పి నమ్మించి.. ఆమె పట్ల పగను పెంచుకున్నాడు. రిజెక్షన్‌ను తట్టుకోలేక తన కోరిక తీర్చకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తానని బెదిరించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.
యాంకర్‌కి బెదిరింపులు
గతంలో ఓసారి కారులో యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారానికి యత్నించాడు. ఆమె తప్పించుకుంది. కక్ష గట్టిన సామ్రాట్ యువతి చిత్రాలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. తన కోరిక తీర్చకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి, పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 8, 2022, 7:23 PM IST