ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువ రైతు ప్రతిభ... 50 సెంట్ల భూమిలో 7 వరి రకాలు! - 50 సెంట్ల భూమిలో 7 వరి రకాలు

విశాఖ జిల్లా బంగారు మె​ట్ట గ్రామానికి చెందిన యువరైతు... తనకున్న 50 సెంట్ల భూమిలో 7 వరి రకాలను పండించి అబ్బురపరిచాడు. వ్యవసాయంలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళితే.. అద్భుతాలు సాంధించవచ్చని నిరూపించాడు.

యువరైతు ప్రతిభ...50 సెంట్ల భూమిలో 7 వరి రకాలు !
యువరైతు ప్రతిభ...50 సెంట్ల భూమిలో 7 వరి రకాలు !

By

Published : May 16, 2020, 11:12 AM IST

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామానికి చెందిన యువరైతు సాయం రఘనాథ్.. సాగులో కొత్త మెళకువలతో అద్భుతాలు సృష్టించాడు. తన వ్యవసాయ క్షేత్రంలోని 50 సెంట్ల భూమిలో ఏడు రకాల దేశవాళీ వరి రకాలను పండించి ​అబ్బురపరిచాడు.

గని, దూదేశ్వరీ, కులాకర్, నవారా, పంచరత్నం, రత్న, చడీ వంటి వరి రకాలను పండించి వ్యవసాయాధికారుల మన్ననలను పొందాడు. వ్యవసాయంలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళితే.. ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చని రఘునాథ్ నిరూపించాడు.

ABOUT THE AUTHOR

...view details