ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గీతం విశ్వవిద్యాలయంపై ఏఐసీటీఈకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ - ఏఐసీటీయీకి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కి లేఖ రాశారు. సాంకేతిక విద్యకు సంబంధించి పలు కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు, తదితర అంశాల్లో విశ్వవిద్యాలయం నిబంధనలను ఉల్లంఘించిందని లేఖలో ఫిర్యాదు చేశారు. సత్వరమే కమిటీని నియమించి అక్రమాలపై విచారణ జరిపాలన్నారు.

ycp mp vijayasai reddy letter to aicte about gitam university
గీతం విశ్వవిద్యాలయంపై ఏఐసీటీయీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

By

Published : Nov 6, 2020, 8:56 PM IST

గీతం విశ్వవిద్యాలయంపై ఏఐసీటీఈకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ఇప్పటికే కేంద్ర విద్యా శాఖ మంత్రి, యూజీసీ ఛైర్మన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిన ఆయన... తాజాగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుదేకి మూడు పేజీల లేఖ రాశారు.

సాంకేతిక విద్యకు సంబంధించి పలు కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు, శిక్షణ సహా భవనాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో గీతం విశ్వవిద్యాలయం నిబంధనలను ఉల్లంఘించిందని లేఖలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించిందని లేఖలో పేర్కొన్నారు. సత్వరమే కమిటీని నియమించి అక్రమాలపై విచారణ జరిపాలని... గీతం విశ్వవిద్యాలయంపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details