రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడానికి, వాటిని ఇప్పుడు మార్చడానికి అయిన ఖర్చును వైకాపా నాయకులే భరించాలని మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జీ పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సచివాలయాలకు మొదట రంగులు వేయడానికి 1400 కోట్లు, ఇప్పుడు వీటిని తొలగించి మరో రంగు వేయడానికి మరో 1400 కోట్ల రూపాయలను వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసిందని అంచనా వేశారు. రంగుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా వైకాపా సర్కార్ వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు.
'సచివాలయ రంగుల ఖర్చును వైకాపా నేతలే భరించాలి' - తెదేపా నేత పీలా గోవింద సత్యనారాయణ వార్తలు
ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల కోసం వైకాపా ప్రభుత్వం 2,800 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని తెదేపా నేత పీలా గోవింద సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఖర్చును అధికార పార్టీ నేతలే భరించాలని డిమాండ్ చేశారు.
peela govinda satyanarayanar peela