ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో వైకాపాకు షాక్.. తెదేపాలోకి కీలక నేత - paidi vekata ramana murthy

విశాఖ జిల్లాలో వైకాపాకు ఒక్కొక్కరిగా నేతలు దూరమవుతున్నారు. ఇటీవలే ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి తెదేపాలో చేరగా... విశాఖ లోక్​సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు తైనాల విజయ్ కుమార్ నిన్న పసుపు కండువా కప్పుకున్నారు. తాజాగా  విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త... అధికార పార్టీ పంచన చేరారు.

వెంకటరమణ మూర్తిని తెదేపాలోకి ఆహ్వానిస్తున్న గంటా

By

Published : Apr 8, 2019, 8:22 AM IST

విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కళా హాస్పిటల్స్ ఎండీ పైడి వెంకటరమణమూర్తి... మంత్రి గంటా సమక్షంలో సైకిల్‌ ఎక్కారు. ఆయన వెంట సుమారు 500 మంది కార్యకర్తలు తెదేపాలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఇతర పార్టీల కీలక నేతలు తెలుగుదేశంలో చేరుతున్నారని అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు.

మీడియాతో గంటా

ABOUT THE AUTHOR

...view details