ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడికాడలో ఉపాధి హామీ పథకం కూలీలు నిరసన

ఏడాదిలో 200 రోజులు పని కల్పించి, రూ.300 రోజువారి కూలి ఇవ్వాలని విశాఖపట్నం జిల్లాలో చీడికాడ మండలంలో ఉపాధి హామీ పథకం కూలీలు నిరసన చేశారు.

vishaka district
చీడికాడలో ఉపాధి హామీ పథకం కూలీలు నిరసన

By

Published : Jun 4, 2020, 11:10 PM IST

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం చీడికాడ, తురువోలు, కోనాం, మంచాల గ్రామాల్లో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశంలో నిరసన చేపట్టారు. ఏడాదిలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజువారి కూలీ రూ.300 ఇవ్వాలని కోరారు.

కేరళ ప్రభుత్వం తరహా 16 రకాలు నిత్యావసర సరకులు, రూ.7500 ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, మెడికల్ కిట్లు అందించాలన్నారు. 15 రోజులకు ఒకసారి కూలీ నగదు చెల్లించాలని కూలీలు సామాజిక దూరం పాటించి నిరసన తెలియజేశారు. అనంతరం చీడికాడలో ఉపాధి హామీ పథకం ఏపీఓ మురళికు వినతి పత్రం అందజేశారు.

ఇది చదవండిచోడవరంలో నిరాశ్రయులకు అన్నదానం

ABOUT THE AUTHOR

...view details