ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి' - ఏపీలో కరోనా వైరస్ వార్తలు

సంపూర్ణ మద్యనిషేధం అమలుచేయాలని విశాఖజిల్లా చీడికాడలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల వల్ల కరోనా మరింత విజృంభిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

womens demands to close wine shops in cheedikada
చీడికాడలో మహిళల ధర్నా

By

Published : May 12, 2020, 12:24 PM IST

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవడం బాధాకరమని విశాఖ జిల్లా చీడికాడలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధరలు రెట్టింపు చేయడంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.

ప్రభుత్వం పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అమలు చేయాలని వారు కోరారు. మరోవైపు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు గండి లక్ష్మీ, జడ్పీటీసీ మాజీ సభ్యులు పోలుపర్తి సత్యవతి, పోతల రమణమ్మ మండల పార్టీ నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details