అదనపు కట్నం తెమ్మని భర్త వేధించడంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడిన సంఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగింది. శీలానగర్‌లో నివాసం ఉంటున్న పి. శ్రీదేవి తన భర్త సతీష్ కట్నం కోసం చేస్తున్న వేధింపులు తాళలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య - విశాఖ న్యూస్
విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే ... భార్య చావుకు కారణమయ్యాడు. అదనపు కట్నం తెమ్మని వేధింపులకు గురి చేస్తుండడంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య