ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో రోడ్డు ప్రమాదం...మహిళ మృతి - లారీ కింద పడి మహిళ మృతి

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం బయటకు వచ్చిన మహిళను లారీ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Woman killed in road accident in Visakha
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం...మహిళ మృతి

By

Published : Apr 8, 2020, 5:26 PM IST

విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అప్పల నరసమ్మ అనే మహిళ మృతి చెందింది. మహిళ గర్భవతి కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో తౌడు లోడుతో వస్తున్న లారీ, వారు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. భర్తతో కలిసి వెళ్తున్న అప్పల నరసమ్మ (23)పై లారీ దూసుకుపోయింది. ఆమె తల లారీ చక్రాల కింది ఇరుక్కుపోయి నుజ్జవడంతో ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని మార్చురికి తరలించారు. ఈ ఘటనతో అటుగా వెళ్లేవారంతా భార్య మృతదేహం వద్ద రోదిస్తున్న భర్తను చూసి చలించిపోయారు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​తో విశాఖలో అధికారులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details