ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో కొవిడ్ పరీక్షలకు భయపడి మహిళ పరారీ - వైజాగ్ జిల్లాలో కరోనా టెస్టులు వార్తలు

ఇతర రాష్ట్రాల నుంచి విశాఖకు వస్తున్న వారికి అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది తెలుసుకున్న ఓ మహిళ భయంతో పరారయ్యింది. అప్రమత్తమైన అధికారులు నాల్గొవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

woman escape for conducting  covid(corona) tests to her at visakhapatnam district
కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిసి మహిళ పరార్

By

Published : Jun 21, 2020, 6:29 PM IST

విశాఖలో కోవిడ్ పరీక్షలకు భయపడి ఓ ప్రయాణికురాలు పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోర్టు ఆసుపత్రి సమీపంలోని సీతారామ కళ్యాణ మండపంలో కొంతమంది ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందులో ఓ ప్రయాణికురాలు తప్పించుకుని పారిపోయిన విషయాన్ని గుర్తించిన రెవెన్యు సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు.

ఓ మహిళ కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా పారిపోయిందని నాల్గొవ పట్టణ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దిల్లీ నుంచి వచ్చిన సదరు మహిళ వివరాలు సేకరించిన పోలీసులు.. ఆమె ఎక్కడ ఉందో గుర్తించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details