విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చే కలుషిత నీటిపై చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన కలెక్టర్ భాస్కర్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రజలు, పరిశ్రమ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. అనంతరం పరిశ్రమలోని ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు. నీటి గొట్టాలను పరిశీలించి నీటి నమూనాలను సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం వ్యవహారిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'ప్రజారోగ్యానికి హాని చేస్తే కఠిన చర్యలు'
నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆరోగ్యానికు హాని కలిగించేలా కంపెనీలు వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ హెచ్చరించారు.
'ప్రజారోగ్యానికి హాని చేస్తే కఠిన చర్యలు'