విశాఖ జిల్లాలోని పంచ గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి... అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రసాద్ పథకం ద్వారా దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు.
'పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం' - సింహాచలం ఆలయం తాజా వార్తలు
విశాఖ జిల్లాలోని పంచ గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
minister avanthi srinivas