విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు స్పిల్వే గేట్లు ఎత్తి, నదిలోకి వరద నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా.. ప్రస్తుతం 136.70 మీటర్ల మేర వరదనీరు చేరినట్లు అధికారులు వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు నదిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువప్రాంతాల నుంచి వరద నీరు మరింత పెరిగితే.. అదనపు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
పెద్దేరు జలాశయం నుంచి నీటి విడుదల
విశాఖ జిల్లా పెద్దేరు జలాశయంలోకి వరద నీరు పోటెత్తటంతో.. నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు జలాశయంలోకి చేరితే, దిగువకు మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పెద్దేరు జలాశయం నుంచి నీరు విడుదల