విశాఖ లాక్డౌన్... రహదారులపై దర్శనమిస్తోన్న వాహనాలు - కరోనా తాజా న్యూస్
విశాఖలో కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో విశాఖలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినా.. కొన్ని వాహనాలు రహదారులు పై దర్శనమిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ వ్యాపార వాణిజ్య కూడలిలో దుకాణాలు మూసివేశారు. ఆసిల్ మెట్ట, జగదాంబ కూడలి వెళ్లే ప్రాంతంలో బారికేడ్లు పెట్టి వాహనరాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
విశాఖ లాక్డౌన్... రహదారులపై దర్శనమిస్తోన్న వాహనాలు