ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ ఘటన ఎప్పటికీ  మిస్టరీగానే  మిగిలిపోతుంది' - undefined

ఎల్జీ పాలిమర్స్ పారిశ్రామిక కర్మాగారంలో 11 ఏళ్లు పనిచేసిన అనంత్ రామ్ గణపతి... ప్రమాదంపై చర్చనీయంశమైన విషయాలు చెప్పారు. ఈ ఘటన ఓ మిస్టరీగా ఉంటుందని అంచనా వేశారు.

Vizag leak may remain a mystery
'విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ మిస్టరీగా మిగిలిపోతుంది'

By

Published : May 9, 2020, 8:11 PM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్​లో గ్యాస్ లీకేజీ ఘటన.. బహుశా చాలా కాలం మిస్టరీగానే మిగిలిపోవచ్చని.. ఆ ప్లాంట్ పూర్వ ఉద్యోగి, కెమికల్ ఇంజనీర్ అనంత్ రామ్ గణపతి అంటున్నారు. స్టైరిన్ వేడెక్కడానికి కారణాలు కనుక్కోవడం అంత సులువు కాదని ఈటీవీ భారత్ ఇంటర్వూలో చెప్పారు.

విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ పారిశ్రామిక కర్మాగారం నుంచి స్టైరిన్ పొగలు ఎందుకు, ఎలా లీక్ అయ్యాయి అనేది ఏళ్లపాటు రహస్యంగా ఉండొచ్చని.. అదే ప్లాంట్‌లో 11 సంవత్సరాలు స్టైరిన్‌ను నిర్వహించిన రసాయన ఇంజనీర్ అనంత్ రామ్ గణపతి చెప్పారు. విశాఖకు చెందిన రసాయన ఇంజనీర్ అనంత్ రామ్ గణపతి 1982 నుంచి 1993 వరకు అదే ప్లాంట్‌లో పనిచేశారు. ఎల్.జీ పూర్వపు కంపెనీ.. హిందుస్థాన్ పాలిమర్స్ గా ఉన్నప్పుడు ఆయన అసిస్టెంట్ ప్లాంట్ మేనేజర్ గా పనిచేశారు. ఆయన ఈటీవీ భారత్ ఢిల్లీ ప్రతినిధి సంజీవ్ బారువాతో మాట్లాడారు. 'నేను చాలాకాలం పాటు స్టైరిన్‌తో పనిచేశాను, దాన్ని ఉత్పత్తి, ముడిపదార్థంగా రెండు విధాలుగా ఉపయోగించాను. అది కూడా మిగతా రసాయనాల వంటిదే. తగిన జాగ్రత్తలతో దానిని ఉపయోగించవ్చచు..' అని అనంత్ రామ్ చెప్పారు. “

'నేను అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఇది చాలా అరుదైన సంఘటన. ఇలాంటిది పరిశ్రమలో ఎన్నడూ వినలేదు. చాలా సంవత్సరాల క్రితం ఏదో ఒక దేశంలో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగింది. ' అని తెలిపారు.

స్టైరిన్ ఎందుకు వేడెక్కుతుందో మనం చెప్పలేమన్న గణపతి.. స్వయంచాలకంగా ప్రేరేపించే పాలిమర్ ప్రతిచర్య వల్ల అది వేడెక్కే అవకాశాలు ఉన్నాయన్నారు. "పాలిమరైజేషన్ ప్రారంభమైన తర్వాత దాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. వేడెక్కడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, దాన్ని సులభంగా కనుగొనగలమని నేను అనుకోను. అగ్ని లాంటిది ఏదీ లేదు. స్టైరిన్ వేడెక్కి ఆవిర్లువస్తాయి.. అంతే " అని అన్నారు. చాలా రోజులు లాక్ డౌన్​లో ఉండటం వల్లే ఇలా జరిగి ఉంటుందా అన్న ప్రశ్నకు.. "అలా అనుకోవడం లేదు" అని బదులిచ్చారు.

"స్టైరిన్​కు గాలిలోని ఆక్సిజన్​ను పీల్చుకునే గుణం ఉంటుంది. ఆవిర్లు బయటకు వచ్చాక .. గాలిలోని ఆక్సిజన్​తో రసాయన చర్య జరగడంతో బయట ఆక్సిజన్ తగ్గిపోయింది. దీనిని పీల్చడంతో పాటు.. బయట తగినంత ఆక్సిజన్ లభించక జనం చనిపోయారు" అని ఆయన విశ్లేషించారు. స్టైరిన్ అనేది పాలిమెర్స్ తయారీలో ఉపయోగించే ఒక మోనోమర్. అనేక రకాల మోనోమర్లను పట్టి ఉంచే గుణం ఉంటుంది. దీనిని సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువ స్థాయిలో నిల్వ ఉంచాలి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు దీనిలో అంతర్గతంగా పాలిమరేషన్ మొదలై ప్రమాదకరంగా మారుతుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details