ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేధిస్తున్న ఎరువుల కొరత.. ఆందోళనలో అన్నదాత - విశాఖపట్నం జిల్లా నేటి వార్తలు

విశాఖపట్నం జిల్లాలో ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కనిపించడం లేదు. ఒక్కో రైతుకు 34 బస్తాల ఎరువులు అవసరమైనా... కేవలం ఒకే బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

vishakhapatnam district formers face fertilizer problems
పొలంలో ఎరువులు చల్లుతున్న రైతు

By

Published : Aug 26, 2020, 3:22 PM IST

జిల్లాలో ఖరీఫ్ సీజన్​లో లక్షా 82 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. ఇందుకు కనీసం 30 వేల టన్నుల యూరియా అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే పూర్తి స్థాయిలో ఎరువులు రాని కారణంగా.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందించాల్సి ఉన్నా... సిబ్బంది కొరత కారణంగా చాలా ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలు కావటం లేదు. ఫలితంగా అన్నదాతలు... ప్రైవేటు డీలర్ల వద్ద అధిక వ్యయంతో ఎరువులు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details