ప్రజల ప్రాణాలను కాపాడే హెల్మెట్ ధరించని వారిపై ఇక నుంచి విశాఖపట్నం పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. . ఇటీవల హనుమంతువాక, పెందుర్తిలో జరిగిన రహదారి ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో హెల్మెట్ ధరించకపోతే ప్రాణాపాయం సంభవిస్తుందని. ఇక నుంచి ఎవరినీ ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ డీసీపీ రమేశ్ కుమార్ ఓప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా..తొలిసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే జరిమానా, రెండోసారి పట్టుబడితే వాహనం స్వాధీనం చేసుకుంటామన్నారు.
హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఇక అంతే..!
హెల్మెట్ ధరించని వారిపై ఇక నుంచి విశాఖ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనను పాటించకపోవటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నందున ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపనున్నారు.
vishakaptnam police will take severe actions about wearing of helmet