విశాఖ జిల్లా చింతపల్లి మండలం వీరవరంలో ఇద్దరు గిరిజనుల హత్యను ఎస్పీ బాబూజీ అట్టాడ ఖండించారు. ప్రశ్నించే గొంతులను మావోలు చంపేశారని తెలిపారు. 'ఇదే గ్రామానికి చెందిన సంజీవరావు అనే వ్యక్తిని 2014లో మావోలు హత్య చేశారని... గ్రామస్థులు ప్రతి దాడి చేయగా డీసీఎం, దళ సభ్యుడు చనిపోయారని గుర్తు చేశారు. తిరుగుబాటును జీర్ణించుకోలేని మావోలు వీరవరంపై దాడి చేసి 10 కుటుంబాలను వెళ్లగొట్టారని చెప్పారు. ఈ అన్యాయానికి ఎదురు తిరిగినందుకు భాస్కరరావు, సత్తిబాబును ఇవాళ ఉదయం హతమార్చారని ఎస్పీ బాబూజీ అట్టాడ తెలిపారు.
ప్రశ్నించినందుకే గిరిజనులను హత్య చేశారు: విశాఖ ఎస్పీ - informers
విశాఖ ఏజెన్సీలో ఇద్దరు గిరిజనులను మావోలు చంపడంపై ఎస్పీ బాబూజీ అట్టాడ తప్పు బట్టారు. ప్రశ్నించినందుకే వారిని హత్య చేశారని తెలిపారు.
ఎస్పీ అట్టాడ