ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలోని విలువైన భూములను ప్రైవేట్​పరం చేస్తే ఊరుకోం: వామపక్ష నాయకులు - విశాపట్టణం జిల్లా వైరల్ వార్తలు

Visakha Purnamarket protests Updates: విశాఖ నగరంలోని విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి ద్వారా వైసీపీ పార్టీ అనుయాయులకు కట్టబెట్టేందుకు చేస్తున్న యత్నాలను జనసేన, టీడీపీ, వామపక్ష పార్టీల నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ.. మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రధాన ద్వారం వద్ద ఈరోజు నిరసన చేపట్టారు. ఎన్నో దశాబ్దాలుగా నగర ప్రజలకు నిత్యావసర సరుకులను విక్రయించే పూర్ణామార్కెట్‌ను పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ పరం చేయాలనే చూస్తే చూస్తూ ఊరుకోమని.. పాలకవర్గం సభ్యులను గద్దె దించేందుకు ప్రజలు సిద్దమవుతున్నారని హెచ్చరించారు.

Visakhapatnam
జనసేన, వామపక్షల నిరసనలు

By

Published : Feb 1, 2023, 7:28 PM IST

Visakha Purnamarket protests Updates: మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం.. విశాఖ నగరంలోని విలువైన భూములను ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి ద్వారా వైసీపీ పార్టీ అనుయాయులకు కట్టబెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తోందని జనసేన, వామపక్ష పార్టీల నాయకులు ఆవేదనను వ్యక్తం చేస్తూ.. నేడు మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ముడసర్లోవ పార్క్ వద్దనున్న 283 ఎకరాల భూమిని పీపీపీ పద్ధతి ద్వారా అధికార పార్టీ నాయకులు చేజిక్కించుకునేందుకు భారీ కుట్ర పన్నుతున్నారని ఆగ్రహించారు.

విశాఖ ముడసర్లోవ పార్కులను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం..

అనంతరం ఎన్నో దశాబ్దాలుగా నగర ప్రజలకు నిత్యావసర సరుకులను విక్రయించే పూర్ణామార్కెట్‌ను సైతం పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ పరం చేయాలని జీవీఎంసీ పాలకవర్గం ఎజెండా అంశంగా ముందుకు తెచ్చిందన్నారు. జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు పాలకవర్గం చర్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పటికైనా జీవీఎంసీ పాలకవర్గం ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాలకవర్గం సభ్యులను గద్దె దించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని హెచ్చరించారు. రానూరానూ పాలకవర్గం ప్రజలపై చెత్త పన్ను భారాన్ని మోపుతోందని.. దీన్ని ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు.

మరోపక్క ఆదిత్య పవన్ మేయర్ హరి వెంకట కుమారి అధ్యక్షతన జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో భాగంగా సుమారు 104 అంశాలపై చర్చలు జరుపుతున్నారు. సమావేశం మొదలైన వెంటనే జీవీఎంసీ రోడ్లు ట్రాఫిక్ సమస్యలపై టీడీపీ నేతలు నిలదీశారు. వైసీపీ కార్పొరేటర్లు సైతం రోడ్ల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీలో వివిధ వార్డులో ఇన్‌డోర్, ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణాలకు సమ్మతిస్తూ.. జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్‌లో ప్రధానంగా పూర్ణామార్కెట్, ముడసర్లోవ పార్కులను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. టీడీపీ, జనసేన. వామపక్షాలు కార్పొరేటర్లు పోరాడుతున్నారు.

విశాఖ నగరంలోని సుమారు 283 ఎకరాల ముడసర్లోవ పార్క్ వద్దనున్న భూమిని, అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా నగర ప్రజలకు నిత్యావసర సరుకులను విక్రయించే పూర్ణామార్కెట్‌ను పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ పరం చేయాలని జీవీఎంసీ పాలకవర్గం ఎజెండా అంశంగా ముందుకు తెచ్చింది. పాలకవర్గం చర్యలను జనసేన, టీడీపీ సీపీఐ, సీపీఎం పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ పాలకవర్గం ఈ చర్యలను ఉపసంహరించుకోవాలి. లేదంచే వారిని గద్దె దించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. -పీతల మూర్తి యాదవ్, జనసేన పార్టీ కార్పొరేటర్.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details