ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో విభేదాలు.. నడిరోడ్డుపై వాగ్వాదం - ysrcp leaders fighting on road news update

వైకాపా నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. విశాఖ గాజువాకలోని మల్కాపురం రహదారిపై ఇద్దరు స్థానిక వైకాపా నేతలు వాగ్వాదానికి దిగారు.

visakha ysrcp leaders fighting on road
రోడ్డుపైనే తిట్లదండకం అందుకున్న వైకాపా నేతలు

By

Published : Nov 24, 2020, 10:28 AM IST

విశాఖ జిల్లా గాజువాకలో వైకాపా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మల్కాపురం వద్ద రహదారిపై ఇద్దరు స్థానిక నేతలు అసభ్య పదజాలంతో తిట్లు అందుకున్నారు. వారి తీరు చూసి స్థానికులు విస్తుపోయారు. వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి పీవీ సురేష్, మాజీ డిప్యుటీ మేయర్ దాడి సత్యనారాయణ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది.

స్థానిక సమావేశానికి తనను ఆహ్వానించ లేదని దాడి సత్యనారాయణ ప్రశ్నించటంతో.. ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాటమాటా పెరిగి రోడ్డుపైనే ఇద్దరు నేతలు బూతులు తిట్టుకున్నారు. ఈ ఇద్దరిలో ఉన్న సత్యనారాయణ.. గాజువాకలోని 7 వార్డులకు వైకాపా ఇంఛార్జ్​గా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details