విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలిస్తోన్న సుమారు 100 పశువులను సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. పాడేరు నుంచి ఇతర ప్రాంతాలకు 6 వాహనాల్లో పశువులను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న పశువులను సబ్ కలెక్టర్ పోలీసులకు అప్పగించారు. ఏజెన్సీ నుంచి జరుగుతున్న పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
ఆరు వాహనాల్లో అక్రమంగా తరలిస్తోన్న100 పశువులు పట్టివేత - illegal
ఆరు వాహనాల్లో అక్రమంగా తరలిస్తోన్న 100 పశువులను విశాఖ సబ్ కలెక్టర్ పట్టుకున్నారు. అక్రమ రవాణాపై పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు పశువుల తరలింపును అడ్డుకున్నారు. పట్టుకున్న పశువులను పోలీసులకు అప్పగించారు.
ఆరు వాహనాల్లో అక్రమంగా తరలిస్తోన్న పశువుల పట్టివేత