2015లో ప్రారంభమైన విశాఖ, దిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణవేళలు మార్పు చేస్తూ రైల్వేశాఖ ప్రకటించిన కొత్త వేళలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరే రైలు.... ఈరోజు నుంచి విశాఖలో రాత్రి 10 గంటలకు బయలుదేరి సుమారు ముప్పై రెండున్నర గంటల తర్వాత....దిల్లీ చేరుతుంది. దిల్లీ నుంచి బయలుదేరే రైలు సమయాలు మాత్రం జనవరి 25 నుంచి అమలులోకి వస్తాయి. దిల్లీలో రాత్రి 8 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. ఇప్పటివరకూ.. ముప్పైనాలుగున్నర గంటల సమయం తీసుకోగా ఇప్పడు ముప్పై రెండున్నర గంటల సమయం పడుతుంది.
నేటి నుంచే ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణవేళలు మార్పు
విశాఖ, దిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్ప్రెస్ వేళల మార్పు చేస్తూ రైల్వే ప్రకటించిన కొత్త షెడ్యూల్ నేటి నుంచి అమల్లోకి రానుంది. 2015లో ఆరంభమైన ఈ రైలు వేళలు మార్పు చేయాలన్న డిమాండ్, అధికారుల పరిశీలన సిఫార్సుల ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ అమోదముద్రతో గురువారం రాత్రి 10 గంటలకు విశాఖలో ఈ రైలు బయలుదేరనుంది.
నేటి నుంచి అమలులోకి రానున్న విశాఖ-దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ మారిన ప్రయాణవేళలు
TAGGED:
ap express latest news