అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వైజాగ్ ప్రజలకే కాదు రెండు రాష్ట్రాల గుండెచప్పుడని అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు, విద్యార్థి సంఘాలతో కలిసి పోరాడతామన్నారు.
విశాఖ ఉక్కు కార్మికులకు విమలక్క సంఘీభావం
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. కార్మికులకు ఆమె సంఘీభావం తెలిపారు.
విశాఖ ఉక్కు కార్మికులకు విమలక్క సంఘీభావం